Kalpana: గాయని కల్పన ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్లోని నిజాంపేటలో ఉన్న వర్టెక్స్ ప్రివిలేజ్ విల్లా్సలో నివాసం ఉంటున్న గాయని కల్పన (Kalpana) ఆత్మహత్యాయత్నం చేసుకోవడంపై విచారణ ప్రారంభించిన పోలీసులు. గాయనిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా, నటిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని కల్పన ఏర్పరచుకున్నారు. దేశవిదేశాల్లో 3000కు పైగా సంగీత ప్రదర్శనల్లో పాల్గొన్నారు.
నిజాంపేటలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కల్పనని చూసేందుకు సింగర్స్ సునీత, శ్రీకృష్ణ తదితరులు వచ్చారు. ప్రస్తుతం ఈమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు పోలీసులు చెప్పారు.













