సింగర్ సునీత రెండో పెళ్లి వాయిదా!
సింగర్‌గా, యాంకర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సునీత. ఇటీవల తన స్నేహితుడు, డిజిటల్ మీడియా వ్యాపారవేత్త అయిన రామ్‌తో నిశ్చితార్థం జరుపుకొని అందరికి షాక్ ఇచ్చింది సునీత. పలు ఇంటర్వ్యూలలో రెండో పెళ్లి చేసుకోనని చెప్పిన ఆమె రీసెంట్గా తన పిల్లల కోరిక మేరకు మళ్లీ పెళ్లి చేసుకుంటున్నానని చెప్పి ఆశ్చర్యపరిచింది. ప్రతితల్లి మాదిరిగానే నా పిల్లలు జీవితంలో స్థిరపడాలని ఎన్నో కలలుకన్నాను. అదే సమయంలో నేను సంతోషంగా ఉండాలని ఆశించే వివేకంతో ఆలోచించే తల్లిదండ్రులు, పిల్లలు నా తోడుగా ఉన్నందుకు గర్వపడుతున్నా. నేను ఆనందించే మధుర క్షణాలు వచ్చాయి. మంచి స్నేహితుడిగా, అద్భుతమైన భాగస్వామిగా రామ్ నా జీవితంలోకి ప్రవేశించారు. త్వరలోనే మేము పెళ్లిచేసుకోబోతున్నాం అని సునీత చెప్పుకొచ్చింది. డిసెంబర్ 27న వీరి వివాహం డెస్టినేషన్ వేడుకగా జరగనుందని పలు వార్తలు రాగా, ఇప్పుడు వచ్చే ఏడాదికి వాయిదా వేసినట్లు తెలుస్తుంది. ఇందుకు కారణాలు తెలియాల్సి ఉంది.













