సింగర్‌తో పీకల్లోతు ప్రేమలో అనిరుధ్
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అనిరుధ్ సాంగ్స్‌కి మంచి క్రేజ్ ఉంది. తమిళంలో ధనుష్ త్రీ మూవీకి మ్యూజిక్ ఇచ్చి అందరినీ మెస్మరైజ్ చేసిన అనిరుధ్, ఆ సినిమాలోని కొలెవరి డీ సాంగ్‌తో బాగా పాపులర్ అయిపోయాడు. ఇంకా చెప్పాలంటే త్రీ సినిమా అనిరుధ్ స్థాయిని పెంచిందని చెప్పాలి.
అసలు విషయంలోకి వస్తే ఈ యంగ్ అండ్ మ్యూజిక్ సెన్సేషన్ ప్రస్తుతం ఓ సింగర్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని వార్తలొస్తున్నాయి. గతంలోనూ అనిరుధ్ ఈ విషయంలో వార్తల్లో ఉన్న సంగతి తెలిసిందే. సీనియర్ హీరోయిన్ ఆండ్రియాతో అనిరుధ్ రిలేషన్ లో ఉన్నాడని ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి.
కాగా అనిరుధ్ ప్రస్తుతం ఫేమస్ సింగర్ జోనితా గాంధీతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండటంతో వారి ప్రేమ వార్త హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలోనూ, బయటా ఎక్కడ చూసినా ఈ జంటే కనిపిస్తుందని చెన్నై ఫిల్మ్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. బీస్ట్ సినిమాలో అరబిక్ కుత్తు సాంగ్ తో ఫేమస్ అయిన జోనితాకు, అనిరుధ్ కు మధ్య విక్రమ్ సినిమాతో రిలేషన్ స్ట్రాంగ్ అయిందని తెలుస్తోంది. అప్పటి నుంచే వీరిద్దరూ కలిసి తిరుగుతున్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలొస్తున్నాయి. ఇంత జరుగుతున్నా వీరిద్దరిలో ఒక్కరు కూడా ఈ విషయంపై ఇప్పటి వరకు స్పందించలేదు.













