త్వరలో తెలుగులో నటిస్తాను : సిమ్రాన్
మంచి సినిమాల్లో నటించే అవకాశం వస్తే త్వరలోనే తెలుగులో నటిస్తాను అని అన్నారు సిమ్రాన్. ట్విట్టర్లో అభిమానులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. కలిసుందాంరా చిత్రాన్ని, అందులో నటీనటుల్ని మర్చిపోలేను. వెంకటేష్‌గారు ఫెంటాస్టిక్ పర్సన్. తమిళంలో టాప్ స్టార్స్ రజనీకాంత్‌గారు జెంటిల్‌మేన్. కమల్‌హాసన్‌గారితో పనిచేయడం చాలా ఆనందంగా ఉంటుంది అని అన్నారు. సమయపాలన, క్రమశిక్షణ, తన ఆరోగ్య రహస్యాలన్నారు. పవర్‌పుల్ రోల్స్ చేయాలని ఉందని, అమృత తనకు ఇష్టమని చిత్రమని చెప్పారు. ఇంకా యాక్టింగ్ ఫిల్మ్ మేకింగ్ పరంగా తాను నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఆమె తెలిపారు.













