నాలుగేళ్ల తరువాత మళ్లీ మాజీ ప్రియుడుతో
మాజీ ప్రియుడు శింబుతో హన్సిక మళ్లీ జోడీ కట్టబోతున్నది. నాలుగేళ్ల విరామం తర్వాత ఈ జంట వెండితెరపై సందడి చేయనున్నారు. గతంలో శింబు హన్సికల ప్రేమాయణం కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా నిలిచింది. సన్నిహితుల ద్వారా ఈ జంట మధ్య మొదలైన పరిచయం కొద్ది రోజుల్లోనే ప్రణయానికి దారితీసింది. ఇరు కుటుంబాల అనుమతితో వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. పెళ్లిపీటల వరకు చేరుకున్న వీరి ప్రణయబంధానికి మనస్పర్థలతో అనుహ్యంగా బ్రేక్‌పడింది. 2015లో వీరిద్దరి కలయికలో వాలు అనే సినిమా రూపొందింది. ప్రేమాయణానికి గుడ్‌బై చెప్పిన తర్వాత శింబు, హన్సిక కలిసి సినిమా చేయలేదు.
నాలుగేళ్ల తర్వాత మహా సినిమాలో మళ్లీ జంటగా నటిస్తున్నారు. శింబుతో సినిమా చేస్తున్న విషయాన్ని హన్సిక స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆసక్తికర వార్తను అందరితో మేమే పంచుకోవాలని అనుకున్నాం. కానీ అనుకున్నదాని కంటే ముందే లీకైంది అంటూ శింబు, హన్సిక ఒకరి చేతిని మరొకరు పట్టుకున్న ఓ ఫోటోను పంచుకున్నది. హన్సిక ట్వీట్ కోలీవుడ్‌లో వైరల్‌గా మారింది. శింబు ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. హన్సిక కోసమే అతడు ఈ సినిమాను అంగీకరించినట్లు ప్రచారం జరుగుతున్నది.













