సిద్దూ తర్వాత ఎవరెవరితో అంటే..
లాస్ట్ ఇయర్ డీజే టిల్లు సినిమాతో మంచి సక్సెస్ ను అందుకుని యూత్ లో ఒక్కసారిగా ఫాలోయింగ్ పెంచుకున్న సిద్దు జొన్నలగడ్డ ఆ తర్వాత ఇప్పటి వరకు మరో సినిమా చేసింది లేదు ఒక్క టిల్లు స్క్వేర్ తప్ప. ఇప్పటికే తన కెరీర్ చాలా లేట్ గా ఊపందుకుంది. ఈ నేపథ్యంలో సిద్దు చాలా ఫాస్ట్ గా సినిమాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇప్పుడు సిద్దూ చేతిలో మూడు ప్రాజెక్ట్ లు ఉన్నట్లు సమాచారం. అందులో ఒకటి చిరూ, కళ్యాణ్ కృష్ణ కాంబోలో వస్తున్న మూవీ. ఈ సినిమాలో శ్రీలీల జోడీగా సిద్దూని లాక్ చేసినట్లు ఇప్పటికే వార్తలు రాగా, అది అఫీషియల్‌గా కన్ఫర్మ్ కావాల్సి ఉంది. రెండోది నందినీ రెడ్డితో ఓ సినిమా. ఇంతకుముందే ఈ సినిమాకు సిద్దు ఓకే చెప్పాడు కానీ అన్నీ మంచి శకునములే మూవీ రిజల్ట్ చూశాక సినిమా స్క్రిప్ట్ విషయంలో మరింత కేర్ తీసుకుంటున్నాడట సిద్దూ.
తనతో తీయబోయే సినిమా విషయంలో కామెడీకి పెద్ద పీట వేసి ఎమోషన్స్ ను కాస్త తగ్గించమని నందినీకి సిద్దూ చెప్పాడని టాక్. ఇక ఇది కాకుండా పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో కూడా సిద్దూ ఓ ప్రాజెక్ట్‌ను ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కీడా కోలా రిలీజ్ అయ్యేవరకు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ వివరాలను బయట పెట్టదలచుకోలేదు తరుణ్. కానీ తరుణ్ నెక్స్ట్ సినిమా సిద్దూతో అని ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ లీకై పోయింది. ఇటు సిద్దూ కూడా టిల్లు స్క్వేర్ తర్వాతే తన తర్వాతి సినిమాలను అనౌన్స్ చేయాలని ఫిక్స అయినట్లున్నాడు. టిల్లు స్క్వేర్ సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.













