సిద్దు రేంజ్ పెరిగిపోయింది
స్టార్ హీరో సినిమాలో మరో స్టార్ క్యామియో చేయడం ఈ మధ్య కామనైపోయింది. కొన్నిసార్లు ఆ హీరో రేంజ్ కంటే పెద్ద ఇమేజ్ ఉన్న వాళ్లతోనే క్యామియో చేయిస్తుంటారు. అలాంటి క్యారెక్టర్లు స్క్రీన్ పై కనిపించేది కొన్ని నిమిషాలే అయినా ఇంపాక్ల్ మాత్రం నెక్ట్స్ లెవెల్ లో ఉంటుంది. లేటెస్ట్ గా టాలీవుడ్ లో రిలీజైన మిస్టర్ బచ్చన్ సినిమాలో ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని క్యామియో ఆడియన్స్ ను ఆశ్చర్యపరిచింది.
అయితే ఆ క్యామియో చేసింది మరెవరో కాదు స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ. ఈ సినిమాలో సిద్దు క్యామియో చేశాడని ఎవరికీ తెలియదు. టీమ్ కూడా ఈ విషయాన్ని ఓ సర్ప్రైజ్లా ఉంచింది. కనీసం ఇందులో సర్ప్రైజ్ క్యామియో ఉంటుందని కూడా ఎవరూ చెప్పలేదు. దీంతో సినిమాలో సిద్దుని చూసి ఆడియన్స్ నిజంగా సర్ప్రైజ్ అయ్యారు.
తెలుగు సినిమాల్లో హీరో ఫ్యామిలీ ప్రమాదంలో ఉన్నప్పుడు ఇలాంటి క్యామియోతో మరో హీరో ఎంటర్ అయ్యి వాళ్లను సేవ్ చేస్తూ ఉంటారు. ఈ సినిమా ప్రీ క్లైమాక్స్ లో ఆపదలో ఉన్న హీరో ఫ్యామిలీని సిద్దునే కాపాడతాడు. తన ఎంట్రీతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. రవితేజ లాంటి పెద్ద స్టార్ సినిమాలో సిద్దు క్యామియో చేశాడంటే తన రేంజ్ ఎంత పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. డీజే టిల్లు, టిల్లు స్వ్కేర్ సినిమాలతో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న సిద్దు క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని డైరెక్టర్ హరీష్ శంకర్ వేసిన ప్లాన్ బాగానే వర్కవుట్ అయింది. సినిమాలో సిద్దు కనిపించింది కొద్ది నిమిషాలే అయినా ఉన్నంతసేపు ఆడియన్స్ ను బాగా అలరించాడు.













