పెద్ద రిస్క్ తీసుకుంటున్న టిల్లూ స్వ్కేర్
ఎప్పటినుంచో మంచి హిట్ కొట్టి, తన కెరీర్ బ్రేక్ కోసం ఎదురుచూసిన సిద్దు జొన్నలగడ్డకు డీజే టిల్లు రూపంలో మంచి బ్లాక్ బస్టర్ పడింది. ఈ సినిమాకు యూత్‌లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెద్దగా బడ్జెట్ పెట్టకుండా సింపుల్ క్రైమ్ ఎలిమెంట్‌తో సిద్దూ బాడీ లాంగ్వేజ్‌ని యూజ్ చేసుకుని, ఈ సినిమాను విమల్ కృష్ణ నడిపించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.
డీజీ టిల్లు మంచి టాక్‌తో పాటూ, భారీ కలెక్షన్లను కూడా వసూలు చేసింది. ప్రస్తుతం సిద్దూ ఈ సినిమా సీక్వెల్ పై దృష్టి పెట్టాడు. దానికి సంబంధించిన షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది. ముందు ఎంతోమంది హీరోయిన్లను అనుకున్నాక, ఆఖరికి అనుపమను టిల్లూ స్వ్కేర్‌లో హీరోయిన్గా ఫిక్స్ చేశారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ప్రొడ్యూసర్ నాగవంశీ ఇప్పటికే ఆగస్ట్ 11 అని డిసైడ్ అయినట్లు ఇన్ సైడ్ ఇన్ఫర్మేషన్. వాస్తవానికి ఈ డేట్‌ను మహేష్-త్రివిక్రమ్ మూవీ కోసం అనుకున్నారు కానీ ఆ సినిమా సంక్రాంతి టైమ్ కు వెళ్లడంతో, ఆ డేట్ ను వదలకుండా టిల్లు స్వ్కేర్‌ని ఆ ప్లేస్‌లో రిలీజ్ చేయాలని చూస్తున్నారట.
అయితే ఇప్పటికే చిరంజీవి భోళా శంకర్ అదే రోజున రిలీజ్ కానుంది. దీంతో పాటూ యానిమల్, గదర్2, జైలర్ సినిమాలు అదే టైమ్‌లో రిలీజ్ కానున్నాయి. ఇన్ని పెద్ద సినిమాల మధ్య టిల్లు స్వ్కేర్ ఆగస్టు 11కి రిలీజ్ కావడం అంటే పెద్ద రిస్క్ అనే చెప్పాలి. టిల్లు స్క్వేర్‌కు మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు.













