మంచి డెసిషన్ తీసుకున్న సిద్దూ
మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశమొస్తే ఎవరైనా సరే ఏం ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పేస్తారు. కానీ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ మాత్రం చిరూ మూవీలో నటించే ఆఫర్ కు నో చెప్పాడని వస్తున్న వార్తలు నెట్టంట హాట్ టాపిక్ అయ్యాయి. బంగార్రాజు ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చిరూ కూతురు సుస్మిత ఈ సినిమాను నిర్మిస్తుంది.
మొదట్లో సిద్దూకి ఈ సినిమా ఆఫర్ వచ్చినప్పుడు పాజిటివ్‌గానే రెస్పాండ్ అయినప్పటికీ, తర్వాత ఆలోచించుకుని ఈ ఆఫర్ ని సాఫ్ట్ గానే రిజెక్ట్ చేశాడని తెలుస్తోంది. మలయాళం హిట్ బ్రో డాడీకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో సిద్దూ కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడనే చెప్పాలి. ఎందుకంటే చిరూ సినిమాలో చిరూ కాకుండా ఎవరు నటించినా డైరెక్టర్ అటెన్షన్, ఫోకస్ మాత్రం మొత్తం చిరూపైనే పెడతారు.
ఓ అప్‌కమింగ్ హీరోకి ఇలాంటి సిట్యుయేషన్ ఇబ్బంది కలిగించే విషయమనే చెప్పాలి. గాడ్ ఫాదర్ సినిమా టైమ్ లో సత్యదేవ్ కి విలన్ క్యారెక్టర్ ఇచ్చినప్పటికీ ఆ సినిమా తర్వాత సత్యదేవ్ కు ఒరిగిందేమీ లేదు. డీజే టిల్లు తర్వాత తనకొచ్చిన ఫేమ్ ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్న సిద్దూకి ఇలాంటి టైమ్ లో మెగాస్టార్ సినిమా చేసి ఉన్న ఫేమ్ కోల్పోవడం ఇష్టం లేకనే ఈ డెసిషన్ తీసుకుని ఉంటాడని, సిద్దూ తీసుకున్న నిర్ణయం సరైనదేనని సినీ విశ్లేషకులంటున్నారు.













