నిశ్చితార్థం నిజమే.. పెళ్లికి తొందరేం లేదు!
నటి శ్వేతాబసు ప్రసాద్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. కొత్తబంగారులోకం చిత్రంతో తెలుగునాట అడుగుపెట్టిన ఈ బెంగాలీ భామ ఈ తర్వాత కూడా పలు చిత్రాల్లో నటించారు. శ్వేత త్వరలోనే ఇల్లాలిగా మారబోతున్నారు. బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టల్‌ని వివాహం చేసుకోనున్నారు. ఈ విషయాన్ని శ్వేత స్వయంగా వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ రోహిత్‌కి నేను గోవాలో ప్రపోజ్ చేశారు. తను పుణేలో నా ప్రేమను అంగీకరించారు. ఈ మధ్యనే పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం జరిగింది. పెళ్లికి ఇప్పుడప్పుడే తొందరేం లేదు. అబ్బాయిలే పెళ్లి ప్రస్తావన తీసుకురావాలని నేననుకోను. రోజులు మారుతున్నాయి. అమ్మాయిలా ప్రపోజ్ చేయొచ్చనిపించి, ప్రపోజ్ చేశాను అన్నారు. ప్రస్తుతం శ్వేత ఓ హిందీ చిత్రంలో నటిస్తున్నారు. ఆమె నటించిన తెలుగు వెబ్ సిరీస్ గ్యాంగ్స్టర్స్ల ఇటీవలే అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది.













