ఆమె కొత్త బంగారులోకం చూడాలని…
‘కొత్త బంగారులోకం’ చిత్రంతో హీరోయిన్గా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన శ్వేతబసు ప్రసాద్ ఆ సినిమాలో తన పెర్ఫార్మెన్స్తో అందర్నీ ఆకట్టుకుంది. ముఖ్యంగా యూత్ ఆమెకు బాగా ఎట్రాక్ట్ అయింది. ఆమెకు వచ్చిన ఫాలోయింగ్ చూసి తప్పకుండా పెద్ద హీరోయిన్ అవుతుందని అందరూ భావించారు. అయితే అదృష్టం కొందర్ని మాత్రమే ఆ స్థాయికి తీసుకెళ్తుంది. అందరూ అనుకున్నట్టు శ్వేత హీరోయిన్గా టాప్ రేంజ్‌కి వెళ్ళలేకపోయింది. వరస పరాజయాల వల్ల ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయింది. దానికితోడు ఓ సెక్స్ రాకెట్ కేసుతో శ్వేత సంబంధాలున్నాయనే ఆరోపణలు ఎదుర్కొంది. అయితే కోర్టు ఆమెను నిర్దోషిగా విడుదల చేసింది. ఆ తర్వాత రోహిత్ మిట్టల్ అనే బిజినెస్‌మేన్‌ని పెళ్ళి చేసుకుంది. అయితే వారి కాపురం ఏడాది పాటు కూడా నిలబడలేదు. సంవత్సరం తిరగకుండానే విడాకులు తీసుకున్నారు. ఓ పక్క కెరీర్ నాశనమైంది, మరో పక్క వైవాహిక జీవితం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. దీంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది శ్వేత.
రీసెంట్గా శ్వేతాబసుకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె డిప్రెషన్లో ఉన్నట్లు ఆ ఫొటోలు చూస్తే అర్థమవుతోందనే కామెంట్స్ వస్తున్నాయి.
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఆ స్టార్ డమ్‌ని ఎంజాయ్ చేసిన తర్వాత అవకాశాలు సన్నగిల్లినా రీ ఎంట్రీ కోసం ట్రై చేస్తుంటారు. మళ్ళీ ఓ బ్రేక్ కోసం ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇప్పుడు శ్వేత కూడా అదే పనిచేస్తోంది. కానీ, సరైన అవకాశాలు దక్కడం లేదు. ఓ వైపు ఛాన్సులు రావడం లేదనే బాధ, మరోవైపు భర్త నుంచి విడిపోవడం శ్వేతను తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నాయి. దీనిపై స్పందిస్తున్న శ్వేత ఫాలోవర్స్ ఆమెకు భవిష్యత్తు ఉండాలని, ఆమె కొత్త బంగారులోకం చూడాలని కోరుకుంటున్నారు.













