Shuthi Haasan: త్రీ సినిమా ఫలితం.. ఇప్పటికీ బాధగానే ఉంటుంది
కొన్ని సినిమాలు సరైన టైమ్ లో రిలీజవక ఆడియన్స్ నుంచి సరైన రెస్పాన్స్ అందుకోలేకపోతాయి. ఫలితంగా సినిమాలు ఫ్లాపవుతూ ఉంటాయి. ధనుష్(Dhanush) హీరోగా, శృతి హాసన్(Shruthi Hassan) హీరోయిన్ గా నటించిన త్రీ(3) సినిమా కూడా అలాంటి కోవకే చెందుతుంది. ఐశ్వర్యా రజనీకాంత్(Aishwarya Rajinikanth) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2012లో రిలీజై బాక్సాఫీస్ వద్ద సరైన ఫలితాన్ని అందుకోలేకపోయింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో శృతి హాసన్ ఈ సినిమా గురించి మాట్లాడింది. త్రీ మూవీ ఇప్పుడు రిలీజై ఉంటే చాలా పెద్ద హిట్టేయదని అభిప్రాయపడింది. త్రీ మూవీ తనకెంతో ఇష్టమైన మూవీ అని, ఆ సినిమాకు మంచి ఫలితం రాకపోవడం ఇప్పటికీ బాధగానే ఉంటుంని, ఆ సినిమా చేయడానికి తానెంతో కష్టపడ్డానని, కానీ ఆశించిన స్థాయిలో త్రీ మూవీ ఆడలేదని చెప్పింది.
ఇకవేళ ఆ మూవీ ఇప్పుడు రిలీజ్ అయితే మాత్రం పెద్ద హిట్ అవుతుందని చెప్పింది. త్రీ మూవీలోని వై దిస్ కొలవెరి డి(Why this kolaveri D) సాంగ్ ఎంత ఫేమస్ అయిందో, ఆ సినిమాలోని కంటెంట్ కూడా అంతే ఫేమస్ అయ్యేదని, ఆ సాంగ్ కంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేదని శృతి హాన్ చెప్పింది. శృతి చెప్పినట్టు త్రీ సినిమాలోని కంటెంట్ బావుంటుంది మరియు ఆ సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. మరి ఈ నేపథ్యంలో ఆ సినిమాను ఏమైనా రీరిలీజ్ చేస్తారేమో చూడాలి.







