అమీర్ ప్రొడక్షన్ హౌస్ లో సల్మాన్..!?
బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వీరిద్దరూ 90s సినిమాల్లో కలిసి నటించారన్న విషయం తెలిసిందే. ఇద్దరు తమ తమ కెరీర్స్ లో బిజీగా ఉండడంట్జో మళ్ళీ కలిసి నటించే అవకాశం రాలేదు. ఫ్రెండ్ షిప్ కి మారుపేరుగా ఖాన్ ద్వయం ని వర్ణించొచ్చు. వీరిద్దరి మధ్య చాలా మంచి బాండింగ్ ఉంది. రెగ్యులర్ గా వీరిద్దరూ కలుస్తూనే ఉంటారు. ఇటు అమీర్ ఖాన్, అటు సల్మాన్ ఖాన్ వారి కెరీర్స్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలని చేసి ప్రేక్షకుల ఆదరణ పొందారు. ఇదిలా ఉంటే రీసెంట్ గా బి టౌన్ లో ఒక ఇంట్రెస్టింగ్ వార్త హల్చల్ చేస్తుంది. సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ ని ఇంటికి వెళ్లి కలిసాడు అనే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఇది కామన్ మీటింగ్ కాదని, ఇద్దరు కలిసి కొత్త ప్రాజెక్ట్ కి సంబంధించి చర్చలు జరిపేందుకు కలిసారని సమాచారం. ఒక వైపు సినిమాల్లో హీరోగా నటిస్తూనే, అమీర్ తన సొంత ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్ కమింగ్ డైరెక్టర్ ఆర్ఎస్ ప్రసన్న చెప్పిన కథ అమీర్ ఖాన్ కి నచ్చడంతో తన ప్రొడక్షన్ హౌస్ లో ఆ సినిమాని నిర్మించేందుకు రెడీ అయ్యారట.
ఈ స్టోరీ లైన్ కి సల్మాన్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడని అనుకున్నారట. ఈ సందర్భంగా కొత్త ప్రాజెక్ట్ విషయాలపై మాట్లాడడానికి అమీర్ ఇంటికి సల్మాన్ వచ్చినట్లు తెలుస్తుంది. ఈ సమయంలో అమీర్ సమక్షంలో సల్మాన్ ఖాన్ కి డైరెక్టర్ స్టోరీ ని కూడా చెప్పినట్టు టాక్. ఇదే కనుక నిజమైతే ఒక అరుదైన సంఘటన బాలీవుడ్ లో జరిగినట్టే. ఒక మెగా హీరో ప్రొడక్షన్ హౌస్ లో మరో మెగా హీరో నటించడం ఇదే మొదటిసారి. మరి ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.













