శృతి మళ్లీ రీఎంట్రీ
రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ లండన్‌లో సింగింగ్ కెరీర్ కోసం ప్రయత్నిస్తున్న శృతి అక్కడ వర్కవుట్ కాకపోవటంతో మళ్లీ రీఎంట్రీ ఇస్తుందనే వ్యాఖ్యాలున్నాయి. మైఖేల్‌తో బ్రేకప్ సంగతేమో కానీ రీఎంట్రీ మాత్రం కన్ఫామ్ అయింది. ఎందుకంటే ఒక్కసారిగా రెడ్‌హాట్ ఫొటో షూట్ చేసింది. ప్రముఖ మ్యాగజైన్కోసం రెడ్ కలర్ థ్సైస్లిట్ డ్రెస్‌లో తళుక్కున మెరిసింది. తనదైన స్టైల్లో నవ్వుతూ అందాలను దారపోసింది. ఎన్నికల వేడితో ఊపిరి ఆడకుండా ఉన్న నెటిజన్లకు పుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేసింది. ఇక అసలు విషయానికొస్తే శృతికి గ్యాప్ వచ్చిన మంచి ఆఫర్లు వస్తున్నాయని తెలిసింది. తమిళంలో రెండు, మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయని అతి త్వరలో సంబంధిత వివరాలు వెల్లడికానున్నాయని సమాచారం.













