వీరి వీరి గుమ్మడిపండు.. వీరి పేరేమి?
ఈ ఫోటో చూస్తుంటే ఓ ఫ్యామిలీ ఫోటోలా అనిపిస్తోంద కదూ. అమ్మ, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అయితే ఈ ఫోటోలో చిన్న మతలబు ఉంది. అది ఏమిటంటే ఈ మూడు ఫోటోలు ఒక్కరివే. అది ఎలాగంటే.. అదే యాప్ మహిమ. ఈ ఫోటోలో ఉన్నది శృతిహాసన్. వరసలో మొదట ఉన్నది ఆమె ఫోటోయే అయినా అది కూడా గుర్తుపట్టలేకుండా ఉంది. నమ్మడానికి కాస్త కష్టంగానే అనిపిస్తుంది. ఈ ఫొటోలను శృతి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది శ్రుతి. లాక్డౌన్ కారణంగా మూడు నెలలపాటు ఇంట్లోనే ఖాళీగా ఉన్న సెలబ్రిటీస్ ఇలాంటివి చేస్తూ టైమ్ పాస్ చేస్తున్నారు.
షూటింగులు లేక, కొన్ని నామమాత్రంగా షూటింగులు జరుగుతున్నా ఆసక్తి లేనివారు షూటింగ్‌కి వెళ్ళకపోవడం వల్ల ఇప్పటికీ చాలామంది ఇళ్ళకే పరిమితమయ్యారు. అందుకే ఖాళీ సమయాల్లో ఏదో ఒక కొత్త యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని తమ సరదాను తీర్చుకోవడమే కాదు, అభిమానులను కూడా అలరిస్తున్నారు. అందుబో భాగంగానే శృతిహాసన్ వృద్ధురాలిగా తను ఎలా ఉంటుంది? లేక తను ఓ అబ్బాయి అయితే ఎలా కనిపిస్తుంది? అనేవి తెలుసుకునే యాప్‌తో ఈ తరహా ఫోటోలు వచ్చాయి.
సోషల్ మీడియాలో ఈ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన ప్రతి ఒక్కరూ ఎంతో షాక్ అవుతున్నారు. బామ్మగా, అబ్బాయిగా ఉన్న ఫోటోలను ఎన్ని హింట్స్ ఇచ్చినా ఎవరూ గుర్తుపట్టలేకపోయారట. ప్రస్తుతం శృతిహాసన్ చేస్తున్న సినిమాల గురించి చెప్పుకోవాలంటే.. రవితేజతో కలిసి `క్రాక్` చిత్రంలో నటిస్తోంది. అంతేకాదు పవన్‌కల్యాణ్ చాలా కాలం తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న `వకీల్‌సాబ్`లో కూడా శృతిహాసన్ నటిస్తోంది. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన `గబ్బర్‌సింగ్` బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ఇవి కాక మరో రెండు సినిమాలు డిస్కషన్లో ఉన్నాయట. వాటి వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.













