మళ్ళీ బిజీ బిజీ గా శృతి హాసన్
బహుముఖ ప్రజ్ఞాశాలి శృతి హాసన్ హీరోయిన్ గా సింగర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా ప్రూవ్ చేసుకుంది ఈ అందాల ముద్దు గుమ్మడు నిజానికి ఈమె హీరోయిన్గా కెరీర్ ప్రారంభించిన సమయంలో తమిళ, తెలుగు, హిందీ భాషల్లో పలు చిత్రాలలో నటించినా ఈమెకి లక్ కలిసి రాలేదు. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ హరీష్‌శంకర్‌ల గబ్బర్ సింగ్ చిత్రంలోని భాగ్యలక్ష్మి పాత్ర ద్వారా ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. ఆ తర్వాత టాలీవుడ్లో అందరు యంగ్ స్టార్స్ తోనూ కలిసి నటించింది. ఇక తమిళ, హిందీ చిత్రాలలో కూడా నిలదొక్కుకునే సమయంలో ప్రేమ దోమ అంటూ తన ఫిజిక్ మరిచిపోయింది. దాంతో ఈమె వైపు ఎవ్వరూ తిరిగి చూడలేదు. ఈమె చివరగా పవన్ తో కాటమరాయుడు సినిమాలో నటించింది.
ఈ చిత్రంలో అమ్మడి లుక్‌ని చూసి అందరు గుడ్ కాంబినేషన్ అనుకున్నారు కానీ ఆ సినిమాకు ఆమె మైనస్ అయ్యింది. ప్రస్తుతం ఆమె రీఎంట్రీ ఇస్తూ తమిళంలో విజయ్ సేతుపతి సరసన ‘లాభం’ అనే చిత్రం లో నటిస్తుంది. ఇక టాలీవుడ్ విషయానికొస్తే ‘వకీల్ సాబ్’ చిత్రం లో పవన్ కళ్యాణ్ సరసన మూడోసారి హీరోయిన్ గా నటిస్తుంది కాగా లక్డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది. ఇక రవితేజ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న క్రాక్ చిత్రంలో రవితేజ సరసన హీరోయిన్ నటిస్తోంది. ఇందులో ఆమె రవితేజ భార్య పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. లేటెస్ట్ గా ఈ లాక్ డౌన్ రూల్ వచ్చిన తరువాత యన్ .టి .ఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న ‘అయినాను పోయి రా వాలే హస్తినకు’ యన్ .టి .ఆర్, సరసన ఒక హీరోయిన్ గా చేస్తున్నట్లు సమాచారం.













