Shruti Hassan: కూలీలో శృతి పాత్ర ఎలా ఉంటుందంటే
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) హీరోగా లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కూలీ(Coolie). గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో రజినీ నెగిటివ్ రోల్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రజినీ స్మగ్లర్ గా నెగిటివ్ రోల్ లోనే పాజిటివ్ యాంగిల్ లో కనిపించనున్నట్లు సమాచారం.
లోకేష్ మార్క్ యాక్షన్ థ్రిల్లర్లు ఎలా ఉంటాయనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదిలా ఉంటే కూలీలో శృతి హాసన్(Shruthi Hassan) కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. కానీ ఇప్పటివరకు శృతి ఎలాంటి పాత్రలో కనిపిస్తుందనేది మాత్రం ఎలాంటి హింట్ ఇవ్వలేదు. తాజా సమాచారం ప్రకారం కూలీలో శృతి పాత్ర కూడా యాక్షన్ డోస్ తోనే ఉంటుందని తెలుస్తోంది.
ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న యాక్షన్ సీన్స్ లో శృతి హాసన్ పై యాక్షన్ సీన్స్ ను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. శృతితో పాటూ మరో 300 మంది జూనియర్ ఆర్టిస్టుల సమక్షంలో ఈ యాక్షన్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. కథలో భాగంగా శృతి పాత్ర బోల్డ్ గా కూడా హైలైట్ అవుతుందని టాక్ వినిపిస్తుంది.













