Shruti Hassan: పెళ్లిపై మంచి అభిప్రాయం లేదన్న శృతి
తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న శృతి హాసన్(Shruti Hassan) బాలవుడ్ లో కూడా కొన్ని సినిమాలు చేసింది. మధ్యలో పర్సనల్ రీజన్స్ వల్ల కెరీర్ కు కొంత గ్యాప్ ఇచ్చిన శృతి రీసెంట్ గా వరుస సినిమాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. శృతి నటిస్తున్న కూలీ(Coolie) సినిమా మేలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే శృతి హాసన్ పర్సనల్ లైఫ్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ డిస్కషన్ నడుస్తుంది. శృతి మొదట మైఖేల్ కోర్సలే(Mikhel Korsale) నుంచి బ్రేకప్ అయినప్పుడు చాలా డిప్రెషన్ తో పోరాడినట్టు తెలిపింది. ఆ తర్వాత డూడుల్ ఆర్టిస్ట్ శంతను హజారికా(Santhanu Hajarika)తో డేటింగ్ చేసింది కానీ రీసెంట్ గా అతడి నుంచి కూడా శృతి విడిపోయింది.
తాజాగా శృతి ఓ ఇంటర్వ్యూలో లవ్, రిలేషన్షిప్, పెళ్లి గురించి మాట్లాడింది. లవ్ లైఫ్, రిలేషన్ లో ఉన్నప్పటి ఆనందం, మజా పెళ్లిలో ఉంటుందని తాను అనుకోవడం లేదని, ప్రేమలో ఉన్నప్పుడు ఆ హ్యాపీనెస్ చాలా బావుంటుందని, పెళ్లి చేసుకుని ఒకరితో ఉండాలంటే భయమేస్తోందని వెల్లడించింది. ఈ ప్రపంచంలోనే అమ్మా నాన్న ఉత్తమ జంట అని తాను అనుకున్నానని, కానీ వాళ్లు విడిపోయాక అంతా మారిపోయిందని, అందుకే పెళ్లిపై తనకు మంచి అభిప్రాయం లేదని శృతి పేర్కొంది.













