శ్రుతి హాసన్ కు లండన్ కాలింగ్!
సమయం కుదిరితే ప్రియుడు మైఖేల్ కోర్సల్‌తో చక్కర్లు కొట్టడానికి సిద్ధపడుతుంటారు శ్రుతీ హాసన్. తన ప్రియుడిది లండన్ కావడంతో ఎక్కువ అక్కడికే హాలీడే ట్రిప్ కోసం వెళ్తుంటారు. షూటింగ్‌కు సంబంధించి కాకుండా ఇప్పటికే చాలాసార్లు ఆమె లండన్ చుట్టొచ్చారు. సోషల్ మీడియా ద్వారా అక్కడి జ్ఞాపకాల్ని, ప్రియుడితో తీసుకున్న ఫొటోలను అభిమానుల ముందుంచుతారు. అయితే మరోసారి ఆమె లండన్ వెళ్లబోతున్నారు. ఈ విషయాన్ని శ్రుతీ ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలిపారు. లండన్ కాలింగ్. నా డార్లింగ్‌తో బెస్ట్ టైమ్ గడపబోతున్నా. స్వచ్ఛమైన హృదయంతో నా జీవితంలో ప్రేమను, వెలుగును నింపుతున్న నా డార్లింగ్‌కు అంతే స్వచ్ఛమైన ప్రేమను పంచుతా అని శ్రుతీ హాసన్ పేర్కొన్నారు.













