బుల్లితెరపై శ్రుతి సందడి!
శ్రుతి హాసన్ ఎవరు? కమల్‌హాసన్ కుమార్తె. ఆమె గుర్తింపు అదొక్కటేనా. కుమార్తె హోదా మాత్రమేనా? శ్రుతి హాసన్ ఎవరు? గాయని. ఆరేళ్ల వయసులో ఇళయరాజా సంగీతంలో తేవర్ మగన్ (తెలుగులో క్షత్రియ పుత్రుడు గా అనువాదమైంది) కోసం పాట ఆలపించారు. అంతేనా శ్రుతి హాసన్ ఎవరు? నటి సంగీత దర్శకురాలు కూడా. ఇప్పుడీ జాబితాలోకి యాంకర్ వచ్చి చేరబోతోంది. త్వరలో తమిళ బుల్లితెరపై ఆమె యాంకర్ అవతారంలో దర్శనం ఇవ్వనున్నారు. ఓ టాక్ షోతో త్వరలో బుల్లితెర వీక్షకుల ముందుకు రానున్నారని, సన్ నెట్‌వర్క్‌తో ఈ మేరకు ఒప్పందం జరిగిందని చైనా టాక్. రెగ్యులర్ టాక్ షోల తరహాలో కాకుండా శ్రుతి గాయని, సంగీత దర్శకురాలు కనుక షో ప్రారంభంలో మ్యూజిక్ లైవ్ పర్పార్మెన్స్, తర్వాత సెలబ్రిటీలతో సరదా సంభాషణలు ఉండేలా రూపకల్పన చేస్తున్నారట. శ్రుతి స్నేహితురాలు తమన్నాతో పాటు పలువురు సెలబ్రిటీలు ఈ టాక్ షోలో సందడి చేయనున్నారని తెలిసింది.













