పెళ్లి పుకార్లు?
అందాల భామ శృతిహాసన్ త్వరలో పెళ్లిచేసుకుంటుందంటూ కోలీవుడ్‌లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఆమె బాయ్‌ఫ్రెండ్ మైఖేల్ కోర్సెల్‌తో ముంబైలో మకాం పెట్టిందని, ఇద్దరు డేటింగ్లో కూడా ఉన్నారంటూ వార్తలొస్తున్నాయి. ఈ మధ్యే తన బాయ్‌ఫ్రెండ్‌ను తల్లిదండ్రులకు పరిచయం చేసిన శృతిహాసన్, ప్రస్తుతం సినిమాలు చేసే ఆలోచనలో లేదట. ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా నో చెబుతోందని, ఇప్పుడు ఎక్కువ సమయం భాయ్ఫ్రెండ్తోనే గడుపుతోందని తెలిసింది. వీరిద్దరి ఫొటోలు సోషల్ మీడియాలో దుమారమే రేపుతున్నాయి. మొత్తానికి శృతిహాసన్ ఈ ఏడాది చివరలో వివాహం చేసుకుంటుందని తమిళ మీడియా కథనాలు ప్రచురిస్తోంది.













