ప్రపంచంలో ఎక్కడైనా అది ఒక్కటే!
ప్రపంచంలో ఎవరికైనా బాధా, సంతోషం, ప్రేమా ఒక్కటే. భావోద్వేగం అనేది ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా ఉండదు. ఈ విషయాన్ని అందరూ ఆర్థం చేసుకోవాలని అని అన్నారు శ్రుతీ హాసన్. ఆమె ప్రస్తుతం హిందీలో పవర్, తమిళ్లో లాభం చిత్రాల్లో నటిస్తున్నారు. తెలుగులోనూ కొన్ని ప్రాజెక్టులు చర్చల్లో ఉన్నాయి. శ్రుతీ హాసన్ మాట్లాడుతూ అన్ని విషయాలకూ రెఫరెన్స్‌లు వెతుక్కుంటూ కూర్చోవడం నాకు నచ్చదు. ఏదో రెఫరెన్స్ చూసి చేసినా అందులో ఒరిజినాలిటీ ఉంటుందని నేను అనుకోను. మరీ ముఖ్యంగా ప్రేక్షకులు ఎమోషన్‌కి కనెక్ట్ కావాలంటే అది సహజంగా ఉండాలి. కొన్ని రకాల భావోద్వేగాలు అందరికీ ఇట్టే అర్థమవుతాయి. ప్రేమలో వైఫల్యం, ఆత్మస్థైర్యం వంటివి కూడా ఆ కోవలోకే చేరుతాయి. అందుకే నేను ఏ పని చేసినా పెద్దగా రెఫరెన్స్‌ల గురించి పట్టించుకోను అని అన్నారు శ్రుతి. ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌లో ఆమె త్వరలోనే కనిపిస్తారని కూడా కోలీవుడ్‌లో వినిపిస్తోంది.













