డేటింగ్ చేస్తే పెళ్లి చేసుకోవాలా?
హీరో కమల్‌హాసన్ కూతురిగా చిత్ర పరిశ్రమకు పరిచయమైన అందాల తార శృతిహాసన్ కొంతకాలానికే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. మల్టీ టాలెంట్ అమ్మాయిగా అందరి ప్రశంసలు అందుకున్న శృతి తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్టార్ హీరోలకు జోడీగా నటించింది. ఒకవైపు హీరోయిన్గా నటిస్తూనే మరోవైపు విదేశాల్లో మ్యూజికల్ లైవ్ షోలు ఇచ్చింది. ఇదే సమయంలో లండన్‌కు చెందిన మైఖేల్ కోర్సలేతో శృతిహాసన్ ప్రేమలో ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. ఇద్దరు కలిసి తిరగడంతో వారి పెళ్లి ఖాయమని అన్నారు. అయితే శృతిహాసన్ ఇప్పుడు పెళ్లి విషయం ఎత్తితే మాత్రం వింత వ్యాఖ్యలు చేస్తోంది. డేటింగ్ చేస్తే పెళ్లి చేసుకోవాలా? అని ప్రశ్నిస్తోంది. మైఖేల్, నాకు మధ్య స్వచ్ఛమైన స్నేహం ఉంది. దాన్ని అపార్థం చేసుకొని పెళ్లి వార్తలు పుట్టిస్తున్నారు. చాలా మంది మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నానంటూ కథనాలు అల్లుతున్నారు. నేను పెళ్లి చేసుకోబోతున్నానంటూ మీడియా వారు తప్పుడు వార్తలు రాస్తున్నారు అని శృతిహాసన్ పేర్కొంది. చిత్ర పరిశ్రమలో పదేళ్లు పూర్తి చేసుకున్న ఈ భామ ఇప్పట్లో తాను పెళ్లి చేసుకోవడం లేదని సృష్టం చేయడం విశేషం.













