శృతిహాసన్ పెళ్లా ?
టాప్ హీరోయిన్ శృతిహాసన్ సినిమాలు తగ్గించిన సంగతి తెలిసిందే. కొందరేమో శృతికి ఆఫర్లు తగ్గి పోయాయంటారు. ఇంకొందరు మాత్రం తనే సినిమాలను తగ్గించేసిందని, కారణం బాయ్‌ఫ్రెండ్ మైఖేల్ కోర్సలే అంటారు. ఏదేమైనా శృతి స్రీన్స్కు కొంత దూరంగా ఉంటున్న మాట వాస్తవం. ఇదిలా ఉంటే ఈ మధ్య లండన్‌లో తన ప్రేమికుడు మైఖేల్‌తో గడిపిన తీపి గుర్తులైన ఫొటోలను అదే పనిగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో శృతి మైఖేల్‌ను పెళ్లి చేసుకోబోతోందని నెటిజన్లు అనుకున్నారు. ఇక ఒక తెలుగు వెబ్సైట్ అయితే కాస్త ఆవేశపడి 2019లో శృతి పెళ్ళి చేసుకోబోతోందని ఆర్టికల్ రాసేంది. ఆ ఆర్టికల్ లింక్‌ను తన ట్విట్టర్ ఖాతా ద్వారా కోట్ చేస్తూ నిజాంగానా అయితే ఇది నాకు న్యూసే అంటూ ఒక సెటైర్ వేసింది శృతి. ఈ లెక్కన పెళ్లి సంగతి ఇంకా కన్ఫార్మ్ కానట్టేనా. శృతి పెళ్లి సంగతి పక్కనపెడితే ఈ మధ్యే ఒక బాలీవుడ్లో ఓ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట శృతి. వరుస ప్రాజెక్టుల మీద ఫోకస్ పెడుతుందేమో చూడాలి.













