నేను ప్రస్తుతం గడుపుతున్న రోజులన్నీ అలాంటివే
కొన్ని విషయాల గురించి మనసులో నిత్యం అనుకుంటూనే ఉంటాం. ఎప్పటికోగానీ మనం అనుకున్నవి జరగవు. అలా చాన్నాళ్లుగా నేను మనసులో తలచుకున్న ఓ అంశం ఇప్పుడు నిజమైంది అని అన్నారు శ్రుతీ హాసన్. సోషల్ మీడియాలో ఆమె ఈ ప్రస్తావన తెచ్చారు. నేను మానసికంగా చాలా సంతోషంగా ఉన్నాను. ఇంత అందమైన జీవితం నాకు దక్కడం భగవంతుడి కృపగా భావిస్తున్నాను అని సంపూర్ణమైన అవగాహనతో చెప్పాలని చాన్నాళ్లుగా అనుకుంటూ ఉన్నాను. ఇప్పటికి చెప్పగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది. నేను ప్రస్తుతం గడుపుతున్న రోజులన్నీ అలాంటివే అని తెలిపారు.













