లాక్డౌన్ వల్ల దాని ప్రభావం ఎక్కవైంది!
లాక్డౌన్ కారణంగా మూడు నెలలపాటు అందరూ ఇళ్ళకే పరిమితమయ్యారు. ప్రభుత్వం ఇచ్చిన సడలింపుల కారణంగా కరోనా కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతున్నప్పటికీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. జనం రోడ్లమీదకు వచ్చారు. అయితే లాక్డౌన్ విధించిన మూడు నెలల్లో అందరూ ఇంటిలోనే ఉండడం వల్ల కొందరికి మానసిక సమస్యలు ఏర్పడుతున్నాయని తమ పరిశీలనలో వెల్లడైందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఆ సమస్య తాను కూడా ఎదుర్కొన్నట్టు హీరోయిన్ శ్రుతిహాసన్ వెల్లడించింది. అయితే ఈ సమస్య ఇప్పటిది కాదని, గత మూడేళ్లుగా ఓ మానసిక సమస్యతో బాధపడుతున్నానని తెలిపింది. దానికి చికిత్స తీసుకుంటున్నప్పటికీ లాక్డౌన్ వల్ల దాని ప్రభావం ఎక్కువైందని చెబుతోంది.
ఈ విషయాన్నిఇంత ఓపెన్‌గా ఎలా చెప్పగలుగుతోందని అందరూ నా గురించి అనుకోవచ్చు. కానీ, నా సమస్యను అందరితోనూ పంచుకోవడం నాకెంతో సంతోషాన్నిస్తోంది. మూడేళ్లుగా ఈ సమస్య ఉండడం వల్ల సినిమాలు కూడా తక్కువ చేశానంటోంది. ఈ సమస్య నుంచి అధిగమించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నానని, అందులో భాగంగా ధ్యానం, యోగా, వ్యాయామం వంటివి చేస్తున్నానని చెబుతోంది. నటిగా, సంగీత దర్శకురాలిగా, సింగర్‌గా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్న శ్రుతిహాసన్ త్వరలోనే మానసికంగా దృఢంగా మారాలని, మళ్లీ సినిమాలతో బిజీ అవ్వాలని మనమూ ఆశిద్దాం.













