శ్రుతీహాసన్ బర్త్‌డే సందర్భంగా ప్రభాస్ ‘సలార్’ ఫస్ట్ లుక్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సలార్’. ఇందులో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తుంది. కరోనా కారణంగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌కి బ్రేక్ పడింది. నేడు(జనవరి 28) శ్రుతీహాసన్ బర్త్‌డే. ఈ సందర్బంగా సలార్ టీమ్ శ్రుతీకి బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ.. ఆమె ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది. ఈ సినిమాలో ఆద్య పాత్రలో శ్రుతీ హాసన్ నటించనుంది. దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టుగా ఈ పోస్టర్ లో శ్రుతీహాసన్ కనిపిస్తోంది. బొగ్గు గనుల మాఫియా నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటించనున్నట్లు సమాచారం. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగండూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదలకానుంది.













