ఎన్టీఆర్ సరసన మరో సారి శృతి హాసన్?
ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ పూర్తి కాకముందే త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరెకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై రాధాకష్ణ (చినబాబు).. హీరో నందమూరి కల్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఎప్పుడు డిఫరెంట్ టైపు టైటిల్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ ముందుంటాడు ఈ చిత్రానికి ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకు స్క్రిప్ట్ ను రెడీ చేసే పనిలో ఉన్నాడు త్రివిక్రమ్. కరోనా లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు కూడా వున్నాయి. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుండి హీరోయిన్ విషయంలో చాలా మంది హీరోయిన్స్ పేర్లు చక్కర్లు కొట్టాయి.
ఎన్టీఆర్ సినీ ప్రస్థానం లో 30వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఒక హీరోయిన్ గా పూజా హెగ్డే, కియారా అద్వానీ, జాన్వీ కపూర్ పేర్లను పరిశీలించిన త్రివిక్రమ్ ఇప్పుడు ఫైనల్‌గా కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ వైపు మొగ్గు చూపారనే టాక్ ఫిల్మ్‌నగర్ లో వినిపిస్తోంది. 2013లో వచ్చిన ‘రామయ్యా వస్తావయ్యా’ చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఓ కథానాయికగా శ్రుతీహాసన్ మరో హీరోయిన్ గా సమంత నటించింది. అప్పట్లో ఈ మూవీ ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఇందులో శృతిహాసన్ పాత్ర నడివి తక్కువే అయినా కథకు చాలా కీలకం. ఆ తరువాత మళ్లీ ఎన్టీఆర్‌తో కలిసి ఏ చిత్రంలో నటించలేదు. తాజాగా ఎన్టీఆర్‌తో కలిసి శృతిహాసన్ నటించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అదే జోడీని ఈ సారి సరికొత్తగా వెండితెరపై ఆవిష్కృతం చేయాలని చూస్తున్నాడట త్రివిక్రమ్.’అరవిందసమేత వీరరాఘవ’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. 2021 సమ్మర్ స్పెషల్ గా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనీ ప్లానింగ్ లో వున్నారు నిర్మాతలు.













