VIjay: జననాయగన్లో మరో భామ
హెచ్. వినోద్(H. Vinoth) దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ విజయ్(Vijay) చివరి సినిమాగా జన నాయగన్(Jananayagan) సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. విజయ్ పాలిటిక్స్ లోకి వెళ్లే ముందు చేస్తున్న లాస్ట్ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ క్రేజ్ ఉంది.
అయితే ఈ సినిమాలో పూజా హెగ్డే(Pooja Hegde) హీరోయిన్ గా నటిస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలో విజయ్ తో మరో హీరోయిన్ కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతుందని కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఓ కీలక పాత్ర కోసం మరో హీరోయిన్ ను తీసుకోవాలని చిత్ర బృందం నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
ఆ భామ మరెవరో కాదు శృతి హాసన్(Shruthi Haasan). ఈ వార్తల్లో నిజమెంతన్నది తెలియదు కానీ నిజమైతే మాత్రం శృతి మరో లక్కీ ఛాన్స్ కొట్టేసిందనే చెప్పొచ్చు. వీరిద్దరూ కలిసి గతంలో 2015లో పులి(Puli) సినిమాలో నటించారు. ఇప్పుడు మళ్లీ పదేళ్ల తర్వాత విజయ్ తో కలిసి శృతి నటించబోతుంది. రెండోసారైనా వీరిద్దరి కాంబినేషన్ విజయం అందుకుంటుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.













