మెగాస్టార్ సరసన శ్రుతిహాసన్ ?
కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి ఓ చిత్రం చేయబోతున్నారు. ఇప్పటికే సిద్ధమైన స్క్రిప్టుకి, ప్రస్తుతం తుదిమెరుగులు దిద్దుతున్నారు. సెట్స్‌పైకి వెళ్లడానికి ఇంకా చాలా సమయం ఉంది. చిరు నటిస్తున్న సైరా నరసింహారెడ్డి పూర్తయ్యాకే, కొత్త చిత్రం కోసం రంగంలోకి దిగబోతున్నారట చిరంజీవి. ఆయన సరసన నటించబోయే కథానాయికలు ఎవరన్నదే ఇంకా తేలలేదు. పలువురు కథానాయికల పేర్లు వినిపించినా తాజాగా శ్రుతిహాసన్ని చిత్రబృందం సంప్రదించినట్టు సమాచారం. చిరు సరసన నటించే ప్రధాన కథానాయిక కోసమే ఆమెని సంప్రదించారా లేక, మరో కీలక పాత్ర కోసమా అన్నది తేలాల్సి ఉంది. కాటమరాయుడు తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు శ్రుతి. కొరటాల శివ దర్శకత్వం వహించిన శ్రీమంతుడు లో శ్రుతిహాసన్ కథానాయికగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.













