ఒకే నెలలో అమ్మడి నుంచి రెండు సినిమాలు
ఫ్లాప్స్ తో తన కెరీర్ ను మొదలుపెట్టిన శృతి హాసన్, గబ్బర్ సింగ్ సినిమా తర్వాత బిజీ హీరోయిన్ అయిపోయింది. వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. మహేష్ బాబు, రవితేజ లాంటి స్టార్లతో సినిమాలు చేసే అవకాశాన్ని అందుకుంది. కానీ ఎప్పుడైతే పవన్ తో మళ్లీ కాటమరాయుడు సినిమా చేసిందో అప్పటి నుంచి శృతికి అవకాశాలు తగ్గాయి.
కాటమరాయుడు ఎఫెక్ట్ అందరికంటే శృతి కెరీర్ కే ఎక్కువ మైనస్ అయింది. మళ్లీ తర్వాత రవితేజ తో క్రాక్ సినిమా చేసి మంచి హిట్ కొట్టింది. ఆ తర్వాత వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాల్లో కూడా నటించి మంచి సక్సెస్ అయితే అందుకుంది కానీ శృతికి మునుపటిలా ఆఫర్లు మాత్రం వరుస పెట్టి రావడం లేదు.
ఇలాంటి టైమ్ లో ఆమె నుంచి ఒకే నెలలో రెండు తెలుగు సినిమాలు రిలీజ్ అవుతుండటం విశేషం. నాని నటించిన హాయ్ నాన్నలో ఓ స్పెషల్ సాంగ్ చేసిన శృతి, సినిమాలో కీలకపాత్రలో కనిపిస్తుందని టాక్. ఈ సినిమా డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత డిసెంబర్ 22న ప్రభాస్ హీరోగా వస్తున్న సలార్ లో కూడా శృతినే హీరోయిన్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. ఈ రెండు సినిమాలూ హిట్ అయితే శృతికి మళ్లీ ఆఫర్లు క్యూ కట్టే ఛాన్సుందని ఫ్యాన్స్ ఆశ పడుతున్నారు.













