శృతి- మైఖేల్ లవ్ బ్రేకప్!
మైఖేల్‌కు ఫీల్ నచ్చలేదు. ఆ విషయం శృతికి అర్థమైంది. ఇద్దరూ ఒక అండర్‌స్టాండింగ్‌కు వచ్చారు. లవ్ జంట బ్రేకప్ చెప్పుకున్నారు. ఇదీ చెన్నై హాట్ న్యూస్. కమల్ కుమార్తె శ్రుతిహాసన్ కొంతకాలంగా లండన్ థియేటర్ ఆర్టిస్ట్ మైఖెల్ కోర్సేల్‌తో లవ్‌లో వున్న సంగతి తెలిసిందే. నిన్న మొన్నటి వరకూ కలిసి తిరిగిన ఇద్దరూ తాజాగా బ్రేకప్ చెప్పేసుకున్నార్ట. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో మైఖెల్ స్వయంగా సృష్టం చేశారు. మమ్మల్ని జీవితం వ్యతిరేక మార్గాల్లో ఉంచిది. బ్యాడ్‌లక్, ఇద్దరం ఒంటరి మార్గాల్లో నడవాల్సి వస్తోంది. కానీ ఆమె ఎప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్‌గానే ఉంటుంది. లైఫ్ లాంగ్ ఆమెకు స్నేహితుడిగా ఉండటానికి హ్యాపీ ఫీలవుతున్నా అంటూ శ్రుతితో దిగిన ఫోటోనూ మైఖేల్ షేర్ చేశాడు. ఇద్దరిమధ్యా గొడవలు లేవని, పరస్పరం చర్చించుకునే స్నేహ పూర్వకంగా విడిపోయారని సన్నిహితవర్గాలు అంటున్నాయి. మూడేళ్ల క్రితం లండన్‌లో మొదలైన వాళ్ల లవ్ జర్నీ బలంగానే సాగింది. కేవలం మైఖేల్ కోసమే శృతి నెలకోసారైనా లండన్ వెళ్తూనే ఉంది. ఆమె ఇంట జరిగే ప్రతి వేడుకకూ మైఖెల్ వస్తూనే ఉండేవాడు. ఇప్పుడు మాత్రం జత కలిసిన జగాలు రెండూ వేర్వేరు అడుగులేస్తున్నాయి.













