Shruthi Hassan: డబ్బింగ్ మొదలుపెట్టిన శృతి
రెండేళ్ల ముందు సలార్(salaar) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శృతి హాసన్(Shruthi Hassan) అప్పటినుంచి మరో సినిమా చేసింది లేదు. అంటే రెండేళ్ల నుంచి శృతి వెండితెరకు దూరంగానే ఉంది. ఇప్పుడు శృతి రజినీకాంత్ హీరోగా వస్తున్న కూలీ(coolie) సినిమాతో కంబ్యాక్ ఇస్తోంది. లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో శృతి హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ సినిమాలో రజినీకాంత్(rajinikanth) హీరోగా నటిస్తుండగా నాగార్జున(nagarjuna), అమీర్ ఖాన్(Aamir Khan), ఉపేంద్ర(upendra) గెస్ట్ రోల్స్ లో కనిపిస్తున్నారు. పూజా హెగ్డే(pooja hegde) ఓ ఐటెం సాంగ్ చేస్తోంది. సత్యరాజ్(satyaraj) ఎంతో కీలకమైన సపోర్టింగ్ రోల్ లో కనిపించనున్నారు. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్ట్ 14న రిలీజ్ కానుంది.
అందులో భాగంగానే శృతి హాసన్ ఇప్పుడు కూలీలో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ ను మొదలుపెట్టింది. ఈ విషయాన్ని స్వయంగా శృతి తన సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఆ పోస్ట్ ఆల్రెడీ నెట్టింట వైరల్ అవుతుంది. కూలీలో శృతి పాత్ర చాలా కొత్తగా ఉండటంతో పాటూ ఆ పాత్ర గుర్తుండిపోయేలా ఉంటుందని ఇప్పటికే మేకర్స్ చెప్పడంతో ఆమె అభిమానులు కూలీ కోసం వెయిట్ చేస్తున్నారు.






