ఓ కూతురిగా ఆయనకు మద్దతిస్తాం
రాజకీయ పార్టీ ప్రకటించనున్న నేపథ్యంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ ఈ నెల 21 నుంచి తమిళనాడులో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయ ప్రముఖులను కలుస్తున్నారు. కాగా, రాజకీయాల్లోకి రావడంపై కమల్ కుమార్తె శ్రుతి హాసన్ తాజాగా స్పందించారు. తనకు రాజకీయాల గురించి ఏమీ తెలీదు కానీ తండ్రి రాజకీయాల్లోకి రావడం గర్వంగా ఉందని తెలిపారు. అసలు రాజకీయాలపై నాకు ఎలాంటి అవగాహన లేదు. కాబట్టి ఈ విషయం మీద నేను మాట్లాడలేను. కానీ ఓ కూతురిగా మా నాన్నను చూస్తుంటే గర్వంగా ఉంది. ఆయన రాజకీయ ప్రయాణంలో ఎల్లప్పుడూ తోడుంటాను. ఆయనకే మద్దతిస్తాను అని తెలిపింది శ్రుతి.













