Sriya Reddy: స్టార్ల సినిమాలైతే అంటున్న శ్రియా

శ్రియా రెడ్డి(sriya reddy) గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. కెరీర్ స్టార్టింగ్ లోనే లేడీ విలన్ గా నటించి ఎంతో మంది ఆదరణను అందుకున్న శ్రియా రెడ్డి రీసెంట్ గా ఓజి(OG) సినిమాలో తన క్యారెక్టర్ తో మంచి ఇంపాక్ట్ చూపించారు. సలార్(salaar) లో కూడా శ్రియా చేసిన రోల్ ఆడియన్స్ ను సర్‌ప్రైజ్ చేస్తుంది. అయితే ఇంత టాలెంట్ ఉండి కూడా శ్రియా తక్కువ సినిమాల్లోనే కనిపించింది.
దానికి కారణం ఆమె పెట్టుకున్న రూల్స్ అండ్ కండిషన్స్. కెరీర్ స్టార్టింగ్ నుంచే పాత్రల విషయంలో ఎంతో సెలెక్టివ్ గా ఉన్న శ్రియా రెడ్డి, సినిమాలో తాను చేసే క్యారెక్టర్ కథలో మంచి ప్రాధాన్యం ఉండాలని అనుకుంది. అందుకే వచ్చిన ప్రతీ ఆఫర్ నూ చేయకుండా, తనకు నచ్చినవి మాత్రమే చేసుకుంటూ వచ్చింది. దాంతో పాటూ అమ్మడికి మరో కండిషన్ కూడా ఉందట.
అదే స్టార్ క్యాస్టింగ్. సినిమాలో తాను నటించాలంటే అది స్టార్ హీరో సినిమానే అవాలని, స్టార్ల సినిమాలు మాత్రమే చేస్తానని పట్టుబట్టి కూర్చుంది. ఈ కారణాలతోనే శ్రియా రెడ్డికి సరైన ఛాన్సులు రావడం లేదనేది అందరూ చెప్తున్నారు. నటిగా తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు తన క్యారెక్టర్ వరకు ఎంతైనా డిమాండ్ చేయొచ్చు కానీ స్టార్ల సినిమాలే అంటే అది తన కెరీర్ పై ఇంపాక్ట్ చూపడం ఖాయం.