ఇందులో దాయటానికి ఏమీ లేదు… శ్రియ
కొన్ని నెలలుగా తన రహస్య వివాహం గురించి స్పందించని శ్రియ తాజాగా స్పందించింది. నేనూ ఆండ్రీ వివాహం చేసుకుని దాదాపు రెండేళ్లవుతోందన్న విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ఇందులో దాయటానికి ఏమీ లేదు. నేనే నా జీవితాన్ని తెలియకుండా ఉంచుకోవటానికే ఎక్కువగా ఇష్టపడతాను. నేను ఎక్కువగా పనిచేస్తూ ఉంటే ఆయన ఆనందిస్తుంటారు అని తన సీక్రెట్ పెళ్లిపై రెండేళ్ల తర్వాత క్లారిటీ ఇచ్చింది. విదేశీయుడిని వివాహం చేసుకున్న శ్రియ.. నటనకు ఫుల్స్టాప్ పెట్టకుండా యధావిధిగా కొనసాగిస్తోంది. ప్రకాష్‌రాజ్ డైరెక్టు చేస్తున్న బాలీవుడ్ మూవీ తడ్కాలో నటిస్తోంది. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది.













