శ్రియ సినిమాలకి గుడ్ బై
2001లో ఇష్టం సినిమాతో తెలుగు తెరకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ శ్రియ శరన్. 37 ఏళ్ళ వయస్సులోను తన అందచందాలతో అలరించిన శ్రియ తన బాయ్ ఫ్రెండ్, రష్యాన్కు చెందిన క్రీడాకారుడు ఆండ్రీ కోస్చీవ్ని మార్చి 12న ముంబైలోని తన ఇంట్లో ప్రైవేట్ సర్మనీగా వివాహం చేసుకుంది. ఈ వేడుకకి ఇండ్రస్టీ నుండి మనోజ్ బాజ్పేయ్, అతని భార్య షబానా అజ్మీ హాజరయ్యారు. శ్రియ పెళ్లికి సంబంధించిన పోటోలు సోషల్ మీడియాలో రావడంతో అభిమానులు కన్ఫాం అయ్యారు. అయితే పెళ్లి జరిగి 20 రోజులు దాటిన ఇప్పటికీ శ్రియ కాని, ఆమె భర్త ఆండ్రీ కానీ తమ పెళ్ళి విషయంపై అఫీషియల్ ప్రకటన చేయకపోవడం విశేషం.
టాప్ మీరోల అందరి సరసన నటించి అలరించిన శ్రియ ఇక వెండితెరపై కనిపించదనే వార్తలు వినిపిస్తున్నాయి. శ్రియ నటనకూ టాటా చెప్పి తన జీవిత భాగస్వామితో కలిసి రష్యాలో మకాం పెట్టడానికి సిద్ధం అవుతోందట. ఈ నేపథ్యంలో వెంకీతో ఓకే చేసుకున్న సినిమాని కూడా క్యాన్సిల్ చేసుకుందని సమాచారం. ముందుగా వెంకటేష్ ప్రధాన పాత్రలో తేజ తెరకెక్కించనున్న చిత్రంలో శ్రియనే కథానాయినికగా ఎంపిక చేశారని వార్తలు వచ్చాయి. సుభాష్ చంద్రబోస్, గోపాల గోపాల వంటి చిత్రాలలో వెంకటేష్ సరసన నటించిన శ్రియ, తేజ చిత్రంలో హ్యట్రిక్ కాంబో రిపీట్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కాని ప్రస్తుతం సోషల్ మీడియాలో శ్రియ సినిమాలకి గుబ్ బై చెప్పనుందనే వార్తలు వస్తుండడంతో అభిమానులు ఆందోళనకి గురవుతున్నారు. దీనిపై క్లారిటీ రావలసి ఉంది.













