ముంబయలో శ్రియ పెళ్లి
ప్రముఖ నటి శ్రియ, రష్యాకు చెందిన ప్రియుడు ఆండ్రీ కోశ్చీవ్‌ను ముంబయలో స్నేహితులు, కుటుంబీకులు, సన్నిహితుల సమక్షంలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. శ్రియ, ఆండ్రీ కోస్చీవ్ వివాహానికి సంబంధించిన ఫోటోలతో పాటు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ జంట పెళ్ళి చేసుకుందనే వార్తలకి సాక్ష్యం ఈ ఫోటోలే అని నెటిజన్స్ ఫోటోస్‌కి కామెంట్స్ పెడుతున్నారు. శ్రియ వివాహం హిందూ ఆచారం ప్రకారం జరిగినట్టు తెలుస్తుండగా, శ్రియ ఎరుపురంగు చీరలో, నగలతో మెరిసిపోతున్నారు. వరుడు ఆండ్రీ షేర్వాణీ ధరించారు. ఇద్దరూ ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటున్నప్పుడు తీసిన ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఆండ్రీ రష్యాకు చెందిన వ్యాపారవేత్త. దాదాపు ఐదేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. త్వరలో ఈ దంపతులు సినీ సెలబ్రిటీల కోసం ముంబైలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. తుజే మేరీ కసమ్తో శ్రియ బాలీవుడ్‌కి ఎంటర్ కాగా, తమిళంలో శివాజీ సినిమాతో కోలీవుడ్ తలుపు తట్టింది. హిందీ, ఇంగ్లీష్ భాషకి సంబంధించిన పలు సినిమాలలో నటించిన శ్రియ రీసెంట్గా గాయత్రి అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.













