ఫుడ్ వ్యాపారంలో శ్రద్ధాశ్రీనాథ్
ఒకవైపు నటన మరోవైపు వ్యాపారం చేసే హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. అవకాశం ఉన్నప్పుడే ఆదాయాన్ని సంపాదించాలనుకుంటారు. సినిమాల్లో నటిస్తూనే, తమకు వచ్చిన ఆదాయంతో శాశ్వత ఆదాయం కల్పించే వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. అనేక మంది హీరోయిన్లు దుస్తులు, బ్యూటీపార్లర్ వ్యాపారంలో ఉన్నారు. ఇప్పుడు నటి శ్రద్ధా శ్రీనాథ్ వీరికి భిన్నంగా సలాడ్ బార్, కేఫ్‌ను ప్రారంభించారు. ‘జెర్సీ’ సినిమా ద్వారా తెలుగు వారికి సుపరిచితురాలైన శ్రద్ధ కన్నడ రాష్ట్రానికి చెందిన నటి. అయినప్పటికీ చెన్నైలో తన వ్యాపారం ప్రారంభించడం విశేషం. తన ఫుడ్ సెంటర్ తనకు థ్రిల్లింగ్ కలిగిస్తోందని అన్నారు. తనకు ఫుడ్‌తో మంచి అనుబంధం ఉందని పేర్కొంటూ భోజన ప్రియులకు శుభ్రమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తానని వాగ్దానం చేసింది. జెర్సీ తర్వాత శ్రద్ధకు తగిన పాత్రలు రానప్పటికీ, తమిళ్లో ఒక సినిమా, తెలుగులో ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ అనే సినిమాలో నటిస్తోంది.













