ఆరోగ్యం కోసం శ్రద్ద డ్యాన్స్ ….
లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితం అయ్యారు. సామాన్యులేకాదు సెలబ్రిటీలు సైతం ఇంటికి అతుక్కుపోయారు. నిత్యం బిజీగా ఉండే సినిమా తారలకు బోలెడంత తీరిక దొరికింది. మరి ఈ సమయంలో వారు ఏం చేస్తుంటారు? సహజంగానే ఆసక్తి కలిగించే విషయం. కరోనా వైరస్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సామాజిక మాధ్యమాలు వేదికగా సలహాలు, సూచనలు చేస్తూనే ఉన్నారు. ఈ తీరిక సమయంలో చాలా మంది తారలు వ్యాయామానికే ప్రాధాన్యత నిస్తున్నారని తెలుస్తోంది. సాహో ఫేమ్ శ్రద్దకపూర్ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం డాన్స్ చేస్తోందట. డాన్స్ అంటే తనకు చాలా ఇష్టమని అంటోంది. డాన్స్ చేస్తేనే సంతోషంగా ఉంటానని అంటోంది. ఎంత కష్టమైన మూమెంట్ అయినా వేయడానికి సిద్దమే అని శ్రద్దకపూర్ చెప్పింది. తనకు డాన్స్ నేర్పించిన వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపింది. బాలీవుడ్ నటుడు శక్తీకపూర్ కుమార్తె అయిన శ్రద్ద నటించిన ఏకైక తెలుగు సినిమా సాహో ఇది హిట్ అయ్యి ఉంటే టాలీవుడ్లో బిజీ అయ్యేది.













