నేను చెప్పాలా? వద్దా?
తెలుగులో శ్రద్ధా కపూర్ నటిస్తున్న తొలి సినిమా సాహో. ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాను ఏకకాలంలో హిందీలోనూ తెరకెక్కిస్తున్నారు. ఇందులో తన పాత్రకు తెలుగు డబ్బింగ్ తననే చెప్పమంటాం…వద్దంటారో? అని శ్రద్ధా కపూర్ అన్నారు. హిందీలో ఎలాగో ఆమె డబ్బింగ్ చెబుతారు. తెలుగుకు వచ్చేసరికి దర్శకుడు సుజీత్దే తుది నిర్ణమని తెలిపారు. ఇంకా శ్రద్ధా కపూర్ మాట్లాడుతూ షూటింగులో నా డైలాగులను తెలుగులో నేనే చెప్పుకుంటున్నా. తెలుగులో నాకు ప్రాంప్టింగ్ అవసరం లేదు. అయితే, తెలుగులో డబ్బింగ్ నేను చెప్పాలా? వద్దా? అనే విషయంలో దర్శకుడు ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. కానీ, నేను తెలుగు మాట్లాడుతుంటే లోకల్ తెలుగు అమ్మాయిలా ఉందని చెప్పడంతో చాలా సంతోషించా అని పేర్కొన్నారు.













