నగ్నంగా నటించేందుకు రెడీ అవుతున్న బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్
ఒక హీరోయిన్ నగ్నంగా నటించబోతోందంటే అది హాట్ న్యూసే. అది కూడా ఒక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆ పని చేయబోతోందంటే అందరిలోనూ ఆసక్తి కలుగుతుంది. ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ చుట్టూ ఈ న్యూస్ తిరుగుతోంది. గత ఏడాది తమిళ్లో విడుదలైన ఆదై చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో అమలా పాల్ నటించింది. విశేషం ఏమిటంటే ఈ సినిమాలో అమల నగ్నంగా నటించింది. అది అందర్నీ షాక్‌కి గురిచేసింది. అయితే ఆమె నటన అందర్నీ ఆకట్టుకుంది. ఈ సినిమా తెలుగులో ఆమె పేరుతో విడుదలైంది. జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన హీరోయిన్గా నటించిన శ్రద్ధా కపూర్ ఈ సినిమాలో నటిస్తుందని సమాచారం. గతంలో ఈ సినిమాలో కంగనా రనౌత్ నటించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అయితే చివరికి ఈ సినిమా శ్రద్ధాను వరించింది. తమిళ్ వెర్షన్‌ను డైరెక్ట్ చేసిన రత్నకుమార్ హిందీ రీమేక్ కూడా డైరెక్ట్ చేయబోతున్నాడు. అయితే ఈ రీమేక్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తారని తెలుస్తోంది.













