ఈ అలవాటును అస్సలు వదలను
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ మాత్రం పొద్దున్నే లేవటం భలేగా ఉందని ఉత్సాహంగా చెబుతోంది. అయితే ముందునుండి ఇలా ఉదయానే లేచే అలవాటు లేదట. మరి ఇప్పుడు ఎలా మారిందంటే.. ప్రభాస్ తదుపరి చిత్రం సాహోలోనే కాకుండా మరో సినిమాలో నటిస్తోంది అమ్ముడు. బ్యాడ్మింటన్ ఛాంపియన్ సైనా నెహ్వాల్ బయోపికల్లో శ్రద్ధ సైనా పాత్రలో నటిస్తోంది. దీంతో బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా సహజంగా కన్పించేందుకు ఇప్పటికే బ్యాడ్మింటన్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకుంది. ప్రతిరోజు ఉదయాన్నే లేచి బ్యాడ్మింటన్ రాకెట్ పట్టుకుని కోర్టులో చెమటలు చిందిస్తోందట. ఈ ప్రాక్టిస్ గురించి మాట్లాడుతూ ప్రతిరోజు ప్రొద్దునే నిద్రలేస్తున్నానని, దీంతో రోజులో చాలా సమయం ఉందని భావిస్తోందని చెప్పింది. ఉదయం లేవటం భలేగా ఉంది. ఈ సినిమా పూర్తయినా బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ మానను. ఈ అలవాటును అస్సలు వదలను అని చెప్పింది.













