సైనా షూటింగ్ షురూ!
ప్రస్తుతం వెండితెరపై బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. నార్త్, సౌత్ తేడాలేకుండా పలు భాషల్లో బయోపిక్‌లు తెరకెక్కుతున్నాయి. తెలుగులో స్వర్గీయ నందమూరి తారక రామారావు, దివంగత నేత వైస్ రాజశేఖర్‌రెడ్డి, తమిళ్లో జయలలిత జీవిత చరిత్రల ఆధారంగా బయోపిక్‌లు రెడీ అవుతున్నాయి. తాజాగా బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌పై తీయబోతోన్న సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలైంది. సైనా గా రాబోతోన్న ఈ చిత్రంలో శ్రద్ధా పూర్ లీడ్ రోల్‌ను పోషిస్తోంది. ఈ చిత్రాన్ని భూషన్ కుమార్ నిర్మించనుండగా, అమోల్ గుప్తే దర్శకత్వం వహించనున్నాడు.













