పుష్పలో ఆ సీన్ యానిమల్ ఇంటర్వెల్కు మించి!
యావత్ భారత దేశమంతటా పుష్ప2 కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నో అంచనాల మధ్య పుష్ప2 ఈ ఏడాది ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంచనాలకు తగ్గట్టే ఈ సినిమా బిజినెస్ కూడా జరుగుతుంది. బిజినెస్ విషయంలో నిర్మాతలు ఎంతో ఆచితూచి అడుగులేస్తున్నారు. అందుకే ఎక్కువ కోట్ చేసినందుకు పుష్ప2 డిజిటల్ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ కు ఇచ్చేశారు.
అయితే ఈ సినిమా గురించి ఫుల్ కిక్కిచ్చే న్యూస్ ఒకటి నెట్టింట వినిపిస్తోంది. పుష్ప2లో స్టోరీ ప్రకారం పుష్పరాజ్ జపాన్ వెళ్తాడు. ఎర్ర చందనం రవాణాకు సంబంధించి ఓ డీల్ సెట్ చేసుకోవడానికి పుష్ప అక్కడికి వెళ్తాడు. కానీ డీల్ కుదిరే టైమ్ కు అక్కడున్న గ్యాంగ్ కుట్ర చేయడంతో వారి పద్మవ్యూహంలో పుష్ప చిక్కుకుంటాడట.
ఆ పద్మవ్యూహం నుంచి తప్పించుకున్న పుష్ప, ఆ డాన్ను జర్మనీలోనే చంపేసే ఎపిసోడ్ ఓ రేంజ్ లో వచ్చిందని చిత్ర యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే ఈ సీక్వెన్స్ యానిమల్ ఇంటర్వెల్ బ్లాక్ ను మించి ఉంటుందంటున్నారు. ఇదొక్కటే కాదు పుష్పలో ఇలాంటి గూస్బంప్స్ సీన్స్ చాలానే ఉంటాయని సమాచారం. జాతరలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ కూడా ఫ్యాన్స్ ను కుర్చీల్లో కూర్చోనివ్వదని చెప్తున్నారు.













