Shobhitha Chaitanya: మాది ఇన్‌స్టా కలిపిన బంధం
నాగ చైతన్య(Naga Chaithanya), శోభిత(Sobhitha Dhulipalla) పెళ్లయ్యాక తాజాగా వోగ్(Vogue) కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు తమ ప్రయాణం ఎలా మొదలైందో తెలిపారు. చైతన్యను కలవకముందు తాను ముంబైలోనే స్థిరపడాలనుకున్నానని, చిత్ర సీమకి సంబంధించిన వ్యక్తిని పెళ్లి చేసుకోకూడదని అనుకున్నట్టు శోభిత చెప్పింది. అయితే, చైతన్యను కలిశాక తన ఆలోచనా విధానం మొత్తం మారిపోయిందని ఆమె తెలిపింది. సక్సెస్, ఫెయిల్యూర్‌ను చైతూ ఒకేలా చూస్తాడని అభిప్రాయపడింది.
చైతూ చాలా బ్యాలెన్డ్స్, క్లియర్ మైండెడ్ అని, చైతూని కలిసేవరకు అంత డౌన్ టూ ఎర్త్ పర్సన్ అని తనకు తెలియదని శోభిత చెప్పింది. ఫస్ట్ టైమ్ అతడి వినయం చూసి ఆశ్చర్యపోయానని, చేసే ప్రతి పనిలో చైతన్య ఒక ఆనందాన్ని వెతుక్కుంటాడని తెలిపింది. చైతూకి ఓపిక కూడా ఎక్కువ అని, సుమారు రెండు గంటల పాటూ తన బైక్‌ను తానే క్లీన్ చేసుకుంటాడని చెప్పింది.
జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న చైతూ అందులో నుంచి పాజిటివ్ కోణాన్నే చూస్తాడని భర్త గురించి శోభిత గొప్పగా చెప్పింది. కస్టడీ మూవీ ఫెయిల్ అయినప్పుడు చైతూ ఎలా ఉన్నాడో, తండేల్ బ్లాక్ బస్టర్ అయినప్పుడు కూడా అలానే ఉన్నాడని శోభిత చెప్పింది. తమ పరిచయం ఇన్‌స్టా ద్వారా జరిగిందని, అయితే చైతూ తనను ఫాలో అవుతున్నాడనే విషయం తనకు చాలా లేట్ గా తెలిసిందని, తెలిశాక చైతూని ఫాలో అయ్యానని, అతను ఇన్‌స్టాలో ఎక్కువగా సుషి గురించి పోస్ట్ చేసేవాడని, తామిద్దరూ ఎక్కువగా ఫుడ్ గురించే మాట్లాడుకునే వారిమని, అలా 2022లో తామిద్దరూ ముంబైలో లంచ్ డేట్ కు వెళ్లినట్టు శోభిత వెల్లడించింది.













