శివాజీరాజా తనయుడి కొత్త చిత్రం ప్రారంభం
శివాజీ రాజా తనయుడు విజయ్ రాజా హీరోగా కొత్త చిత్రం షూటింగ్ శ్రీకాకుళంలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి అనివెట్టి మండపంలో ప్రారంభమైంది. ఈ సినిమాను లక్ష్మీ శ్రీనివాస మూవీ బ్యానర్‌పై తమ్మినేని శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. స్నేహ గోషల్ కథానాయిక. ఈ సినిమాకు ఎం.రాధోడ్ దర్శకత్వం అందిస్తున్నారు. హీరో హీరోయిన్లపై రూపొందించిన ముహూర్తం సన్నివేశానికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ క్లాప్ కొట్టారు. ఆదిత్యుని సన్నిధిలో తన కుమారుని సినిమా షూటింగ్ ప్రారంభించడం ఆనందంగా ఉందని శివాజీరాజా అన్నారు. ఈ సినిమా పేరు త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.













