Shiva: శివ రీరిలీజ్ వెర్షన్ చూస్తున్నప్పుడు కొత్త సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది : నాగార్జున
శివ మేడ్ ఫర్ వన్ అండ్ ఓన్లీ నాగార్జున. ఆయన్ను తప్ప మరొకరని ఊహించుకోలేను. శివ రీరిలీజ్ 4K డాల్బీ ఆట్మాస్ లో గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది: రామ్ గోపాల్ వర్మ
కింగ్ నాగార్జున(King Nagarjuna) ఆల్ టైం కల్ట్ క్లాసిక్ ‘శివ’ బాక్సాఫీసు రికార్డులుని తిరగరాస్తూ ఇండియన్ సినిమాను ‘బిఫోర్ శివ’, ‘ఆఫ్టర్ శివ’గా రీడిఫైన్ చేసింది. రామ్ గోపాల్ వర్మ(Ram gopal Varma) దర్శకత్వంలో1989లో విడుదలైన శివ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నిర్మాతలు అక్కినేని వెంకట్ & సురేంద్ర యార్లగడ్డ నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఇయర్స్ సందర్భంగా శివ చిత్రాన్ని 4K డాల్బీ ఆట్మాస్ లో నవంబర్ 14న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ రోజు స్పెషల్ ప్రిమియర్ షో నిర్వహించారు. అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో కింగ్ నాగార్జున, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పాల్గొన్నారు.
రాము గారు.. 36 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్స్ లో అంతే ఎక్సయిట్మెంట్ ఉంది. ముఖ్యంగా మ్యూజిక్ క్వాలిటీ చాలా అద్భుతంగా ఉంది. రీరిలీజ్ కోసం సౌండ్ లో ఎలాంటి కేర్ తీసుకున్నారు?
– సౌండ్ క్యాలిటీ ఎన్హెన్స్ అయ్యిందని చెప్పడం చాలా ఆనందంగా ఉంది. ఒరిజినల్ లో ఉండే ఫ్లేవర్ పోకుండా ఏఐ టెక్నాలజీని వాడి బెటర్ ఎఫెక్ట్ ఇవ్వడం కోసం వర్క్ చేసాము. అది మీ అందరికీ నచ్చడం హ్యాపీగా ఉంది.
నాగార్జున గారు 36 ఏళ్ల తర్వాత మళ్లీ సినిమా చూస్తున్నప్పుడు ఏమనిపించింది?
-36ఏళ్ల తర్వాత రీరిలీజ్ లో ఇలా కలుస్తామని నేను కలలో కూడా అనుకోలేదు. శివకి ఇంత ఆదరణ కల్టి ఫాలోయింగ్ ఉంటుందని కలలో కూడా అనుకోలేదు. రాము అప్పుడు ఎంత ఇష్టపడి ప్రతిదీ కేర్ తీసుకుని చేశాడో రీ రిలీజ్ కోసం కూడా గత ఆరు నెలల నుంచి అంతే ఇష్టంతో వర్క్ చేశారు. సౌండ్ అద్భుతంగా వినిపిస్తుంది అని అంటున్నారు. ఇదంత రాము చేసిన ఎఫర్ట్. డాల్బీ అట్మాస్ కి తగ్గట్టుగా ఈ సౌండ్ ని రీ క్రియేట్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ టీం చాలా అద్భుతంగా చేశారు. మీరు చూసి ఎంత ఇంప్రెస్ అయ్యారు మొన్న నేను చూసి అంతే కొత్తగా ఫీలయ్యా. కొత్త సినిమా చూసినట్టుగా అనిపించింది. సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా సౌండ్ బాగుందనే కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఫస్ట్ టైం నేను సౌండ్ బాగుంది అనే టాకు శివ సినిమా కోసం విన్నాను.
-శివ మాకు చాలా పర్సనల్. ఇది 50 ఇయర్స్ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్. 50 ఇయర్స్ యానివర్సరీ రోజున సినిమాని రీరిలీజ్ చేయాలనుకున్నాం. నిజానికి పదేళ్ల క్రితమే 4కే చేసాము .అయితే అప్పుడు డాల్బీ జరగలేదు. ఇప్పుడు అన్ని హంగులతో ఒక స్పెషల్ అకేషన్ లో సినిమా రిలీజ్ చేస్తున్నాం. నిజానికి ఇది ఏదో ప్రాఫిట్ వస్తుందని చేయలేదు. సినిమాకి ఏం కావాలో అన్ని రాము అడిగాడు. మేమిచ్చాం.
నాగార్జున గారు శివ ఒక ట్రెండ్ సెట్టర్ ఫిల్మ్ అవ్వడానికి కారణం ఏమని భావిస్తున్నారు?
-రాము స్ట్రాంగ్ విజన్, కన్వెన్షన్‌తో వచ్చారు. సినిమాని ఇలా కూడా తీయొచ్చని చూపించారు. నేను కూడా చాలాసార్లు ఎందుకు ఇది కల్ట్ సినిమా అయిందని భావిస్తుంటాను. సంథింగ్ మ్యాజిక్ జరిగింది.
నాగార్జున గారు అమల గారిని స్క్రీన్ మీద చూసినప్పుడు ఎలా అనిపించింది?
-వెరీ నోష్టాలజిక్ ఫీలింగ్. సినిమా చూసినప్పుడు అమల ఊర్లో లేదు. couldn’t take my eyes off you అని మెసేజ్ పెట్టాను( నవ్వుతూ ) . సినిమా చూస్తున్నంతసేపు ఫెంటాస్టిక్ మెమ సినిమాలో ప్రతిదీ గ్రేట్ మెమరీ.
నాగార్జున గారు శివ చూసిన తర్వాత నాన్నగారు ఏమన్నారు?
-‘సినిమా చాలా పెద్ద హిట్. చాలా మంచి సినిమా చేశావ్. ఇది ఎక్కడికి వెళ్లి ఆగుతుందో తెలియదు’ అన్నారు
రాము గారు మళ్ళీ శివ తీస్తే ఎవరితో చేస్తారు?
శివ మేడ్ ఫర్ వన్ అండ్ ఓన్లీ నాగార్జున.
నాగార్జున గారు శివ సినిమాలో ఛాలెంజింగ్ అనిపించింది ఏమిటి?
-ఇందులో ఛాలెంజ్ ఏమీ లేదు. సినిమాని చాలా ఇష్టపడి చేశాం. శివ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ప్రతిదీ ఒక న్యూ ఎక్స్పీరియన్స్. నేను అప్పటికే 8 సినిమాలు చేశాను. అయినప్పటికీ శివ అనేది నాకు షూటింగ్ పరంగా కూడా కొత్త ఎక్స్పీరియన్స్.
నాగార్జున గారు.,, వర్మగారి మీద మీకు ఎప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది?
-శివ సినిమాకి ముందే రాముతో ఒక సినిమా చేయాలని ఫిక్స్ అయిపోయాం. తను నా అవుట్ డోర్ షూటింగ్స్ కి వచ్చేవాడు. అప్పుడే ఫిక్స్ అయిపోయాం. తన కథ నచ్చింది. తన సెన్సిబిలిటీస్ కూడా నాకు చాలా ఇష్టం. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత నేను మళ్ళీ వెనక్కి వెళ్ళను.
నాగార్జున గారు శివ రీ రిలీజ్ క్వాలిటీ చాలా అద్భుతంగా ఉంది.. రీ రిలీజ్ సినిమాకి ఇది ఒక కొత్తబాట చూపిస్తుందని భావిస్తున్నారా?
-కచ్చితంగా. మనకు ఎన్నో క్లాసిక్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం చూడాలనుకుంటున్నాం. ప్రతిభాషలో చూడాల్సిన క్లాసిక్స్ ఉన్నాయి. వాటన్నిటికీ శివ ఒక పాత్ క్రియేట్ చేస్తుందని భావిస్తున్నాను. దానికి కూడా రామునే ఆద్యుడుగా నిలుస్తాడని భావిస్తున్నాను.
నాగార్జున గారు.. ఈ సినిమా కథ అన్న రాంగోపాల్ వర్మ గారు చెప్తుంటే మీరు ఏం ఆలోచించారు?
-శివకి ముందు గీతాంజలి చేశాను. అక్కడి నుంచి కొంచెం చేంజ్ ఓవర్ మొదలైంది. అంతకు ముందు చేసిన సినిమాలు నాకు అంతగా నచ్చేవి కాదు. నా క్యారెక్టర్స్ నాకు కాస్ట్యూమ్స్ నచ్చట్లేదు.ఇతర సినిమాలని దర్శకుల్ని విమర్శించడం నా ఉద్దేశం కాదు అవి నాకు పర్సనల్ గా నచ్చట్లేదు. అలాంటి సమయంలో మణిరత్నం గారు గీతాంజలితో వచ్చారు. తర్వాత రాము శివ కథతో వచ్చారు. ఇద్దరు దర్శకులు కూడా మాస్టర్స్. వారి సెన్సిబిలిటీస్ నాకు ఇష్టం. రెండు సినిమాలు చాలా అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి.
రాము గారు సైకిల్ చైన్ ఐడియా ఎలా వచ్చింది?
-నాగార్జున క్యారెక్టర్ ఒక స్టూడెంట్. తన రౌడీ కాదు. కానీ ఒక సిచువేషన్ లో తన చేతిలో వెపన్ ఉండాలనుకున్నప్పుడు, అది నేచురల్ గా ఉండాలి. అలాంటి సమయంలో తన దగ్గరలో ఉండే ఏదైనా ఒక వెపన్ లాంటిది కావాలనుకున్నాం. అలా సైకిల్ చైన్ ఐడియా క్రియేట్ అయింది.
నాగ్ గారు శివ చూస్తున్నప్పుడు ఫ్యూచర్ లో ఇంలాంటి సినిమాలు చేయాలని ఆలోచన కలిగిందా?
-రాము శివ క్యారెక్టర్ అందులో ఉన్న హీరోయిజం గురించి ఒక నోట్ పంపించాడు. బ్యూటిఫుల్ నోట్ అది. అలాంటి క్వాలిటీస్ ఉండే క్యారెక్టర్స్ ఇకపై నేను చేయబో సినిమాల్లో పెట్టుకోవాలి. అలాంటి సిమిలర్ క్వాలిటీస్ ఉండాలని చాలా ఇన్స్పైర్ అయ్యాను.
నాగార్జున గారు మీ వందో సినిమా ఒక కొత్త డైరెక్టర్ కి ఇవ్వడం వెనుక మీ థాట్ ప్రాసెస్ ?
నో థాట్ ప్రాసెస్. ఓన్లీ మనసుకు నచ్చింది చేయడమే. దాని గురించి పెద్దగా ఆలోచించేదేం లేదు.
నాగార్జున గారు నాగచైతన్య అఖిల్ శివ సిమాని సీక్వెల్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా?
-వాళ్లకి అంత కరేజ్, గట్స్ ఉన్నాయని నేను అనుకోవడం లేదు (నవ్వుతూ)
రాము గారు రెండు సాంగ్స్ కట్ చేసి రీరిలీజ్ చేశారు కదా ఆ పాటలకి కూడా ఫ్యాన్స్ ఉన్నారు?
-సౌండ్ క్వాలిటీ ఇంత పెరిగాక సాంగ్స్ స్లోడౌన్ చేస్తాయని మాకు అనిపించింది. అందుకే ఆ రెండు సాంగ్స్ తీయడం జరిగింది
అప్పుడు సినిమాలో ఐదు పాటలు ఉండాలనే ఫార్ములా ఉండేది. ఇప్పుడు మాకు ఛాన్స్ దొరికింది. తీసేసాం. అయితే సినిమా ఎండ్ లో సాంగ్స్ ని అటాచ్ చేశాను. ఫ్యాన్స్ ఎంజాయ్ చేయొచ్చు (నాగార్జున)
నాగార్జున గారు నెక్స్ట్ రామ్ గోపాల్ వర్మ గారితో సినిమా చేసే ఆలోచన ఉందా?
-రాము మీద నాకు అదే కాన్ఫిడెన్స్ ఉంది. అన్ని వర్కౌట్ అయితే తప్పకుండా చేస్తాం.
-నేను బయట ఒక హిట్ కొట్టిన తర్వాతే నాగార్జున ని అప్రోచ్ అవుతాను(రాంగోపాల్ వర్మ)







