Shiva: శివ కలెక్షన్లు ఎంతంటే?
ఈ మధ్య టాలీవుడ్ లో రీరిలీజ్ సినిమాలు బాగా ఎక్కువ అయ్యాయనే సంగతి తెలిసిందే. హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఎన్నో సినిమాలు ఇప్పటికే రీరిలీవగా, రీసెంట్ గా టాలీవుడ్ కల్ట్ మూవీస్ లో ఒకటిగా నిలిచిన శివ(Shiva) సినిమా కూడా రీరిలీజైంది. అక్కినేని నాగార్జున(akkineni nagarjuna) హీరోగా రామ్ గోపాల్ వర్మ(ram gopal varma) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆ రోజుల్లోనే భారీ హిట్ గా నిలిచింది.
ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా అమల(amala) నటించగా, శివ మూవీ ఇండియన్ సినిమా వద్ద ఓ గేమ్ ఛేంజింగ్ మూవీగా నిలిచింది. టాలీవుడ్ లో ఏ సినిమా రీరిలీజవుతున్నా ఫ్యాన్స్ శివ మూవీ రీరిలీజ్ గురించి అడిగేవారు. అయితే మేకర్స్ ఎంతోకాలంగా ఈ రీరిలీజ్ పై వర్క్ చేసి రీసెంట్ గా నవంబర్ 14న దీన్ని పునఃవిడుదల చేయగా, ఆడియన్స్ నుంచి దీనికి ఎంతో మంచి రెస్పాన్స్ వచ్చింది.
వరల్డ్ వైడ్ గా రీరిలీజుల్లో మంచి ఓపెనింగ్స్ ను తెచ్చుకున్న శివ రెండో రోజు కూడా అంతే స్ట్రాంగ్ కలెక్షన్లను అందుకుంది. రెండు రోజుల్లో శివ మూవీ రూ.3.95 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. మూడో రోజు కూడా వీకెండ్ కలిసి రావడంతో శివకు మంచి నెంబర్స్ నమోదయ్యే అవకాశముంది. ఇళయరాజా(ilayaraja) సంగీతం అందించిన ఈ సినిమాలో రఘువరన్(raghuvaran) విలన్ గా నటించిన విషయం తెలిసిందే.






