శిల్పాశెట్టికి చేదు అనుభవం!
తన కుటుంబంతో కలిసి సిడ్నీ నుంచి మెల్బోర్న్కు విహార యాత్రకు వెళ్తున్న బాలీవుడ్ నటి శిల్పాశెట్టికి సిడ్నీ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. విమానాశ్రయ అదికారులు అమెపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారని శిల్పా ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. క్యాంటాస్ ఎయిర్‌లైన్స్‌లో నాకు ఎదురైన అనుభవం ఇది. ఈ ఘటన గురించి ముఖ్యంగా ఎయిర్‌లైన్స్ అదికారులు తెలుసుకోవాలి. చెకిన్‌లో మెల్ అనే ఉద్యోగిని నన్ను అడ్డుకుంది. నా దగ్గర రెండు బ్యాగులు మాత్రమే ఉన్నాయి. కానీ మెల్ నా రెండు బ్యాగుల్లో ఒక బ్యాగు అధిక బరువు ఉందని చెప్పి మరో కౌంటర్‌కు పంపించింది. ఇదంతా చెకిన్ కౌంటర్ క్లోజ్ చెయ్యడానికి ఐదు నిమిషాలకు ముందు జరిగిన ఘటన. అక్కడే ఉన్న మరో ఉద్యోగిని మార్వాదగానే మాట్లాడి ఓవర్‌సైజ్ లగేజ్ లేదని ఎంత చెప్పినా మెల్ నన్ను అక్కడే కూర్చోబెట్టింది. నాకు ఆలస్యం అవుతుండడంతో మరో ఓవర్‌సైజ్ బ్యాగేజ్ కౌంటర్ వద్దకు వెళ్లి నా బ్యాగును ఇచ్చి వచ్చాను. భారతీయులతో ఎలా మాట్లాడినా ఫర్వాలేదనుకుంటారో ఏమో నాకు అర్థం కాలేదు. మేమంటే అంతా చిన్న చూపా? ప్రయాణికులు ఏ ప్రాంతం వారైన మర్వాదగా నడుచుకోవాలని క్యాంటాస్ ఎయిర్‌లైన్స్ సిబ్బందికి నేర్పించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.













